జింకకు పోస్టుమార్టం చేసిన డాక్టర్..
1 min read
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో పశువైద్య కేంద్రం దగ్గర సోమవారం ఉ 10:30 కు చనిపోయిన జింక (ఒక సం)కు పశువైద్య అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి పోస్టు మార్టం చేశారు.డాక్టర్ తెలిపిన వివరాల మేరకు ఆదివారం మండలంలోని నాగలూటి గ్రామ బయట సాయంత్రం 6:30 సమయంలో జింక వెళ్తూ ఉండగా జనాలను చూసి భయ భ్రాంతులకు గురైన జింక పరిగెడుతూ ఉండగా జింక గోడకు తగలడంతో తలకు బలంగా గాయం కావడంతో జింక అక్కడికక్కడే మృతి చెందిందని డాక్టర్ తెలిపారు. నిన్న ఉదయం పోస్టు మార్టం నిర్వహించి ఫారెస్ట్ పోలీస్ సిబ్బందికి అందజేయడం జరిగిందని డాక్టర్ సాయినాథ్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.