నెహ్రూ కారు డ్రైవర్ కన్నుమూత
1 min read
పల్లెవెలుగువెబ్: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కారు డ్రైవర్, స్వాతంత్ర్య సమరయోధుడు మోనప్ప గౌడ కోరంబడ్క కన్నుమూశారు. ఆయన వయసు 102 సంవత్సరాలు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని కనకమాజుల గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు వెంకటరమణ, ముగ్గురు కుమార్తెలు కమల, విమల, కుసుమ ఉన్నారు. స్వాతంత్ర్య సమరంలో నెహ్రూకు సాయం చేసిన ఆయన ఆ తర్వాత నెహ్రూ కారు డ్రైవర్‌గానూ పనిచేశారు. అలాగే, నవలా రచయిత శివరామ్ కరంత్, మాజీ ఎంపీ శ్రీనివాస్ మాల్యా, మాజీ ముఖ్యమంత్రి కెంగల్ హనుమంతయ్య వద్ద కూడా కారు డ్రైవర్‌గా పనిచేశారు.