PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పల్లెవెలుగు’ కృషి.. అభినందనీయం..

1 min read
  • జీవీఆర్​ హాస్పిటల్​ కరస్పాండెంట్​ డా. భువనేశ్వరి

పల్లెవెలుగు, కర్నూలు:గ్రామీణ, పట్టణ ప్రజల సమస్యలను  ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి… పరిష్కరించే దిశగా వార్తలు రాయడంలో పల్లెవెలుగు దినపత్రిక ముందుంటుందని అభిప్రాయపడ్డారు జీవీఆర్​ హాస్పిటల్​ కరస్పాండెంట్​, డైరెక్టర్​, పీడియాట్రిక్​ వైద్యులు డా. భువనేశ్వరి. గురువారం పల్లెవెలుగు దినపత్రిక 2023 క్యాలెండర్​ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవీఆర్​ హాస్పిటల్​ కరస్పాండెంట్​, డైరెక్టర్​, పీడియాట్రిక్​ వైద్యులు డా. భువనేశ్వరి మాట్లాడుతూ ప్రజలకు..ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా పని చేయాలని కోరారు. సమాజంలో అవినీతి  రూపుమాపడంలో మీడియాపాత్ర కీలకమన్నారు. మారుతున్న కాలానుగుణంగా పల్లెవెలుగు దినపత్రిక డిజిటల్​ మీడియా (వెబ్​ మీడియా) వైపు అడుగులు వేయడం అభినందనీయమన్నారు. సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి… పల్లెవెలుగు డిజిటల్​ మీడియా మరింత అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా జీవీఆర్​ హాస్పిటల్​ కరస్పాండెంట్​, డైరెక్టర్​, పీడియాట్రిక్​ వైద్యులు డా. భువనేశ్వరి ఆకాంక్షించారు.

About Author