గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఎన్నిక విజయవంతం
1 min read– సంఘటిత ఉద్యమంతోనే సమస్యలు పరిష్కారం : చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఏలూరు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికయ్యింది. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు, ఎపిజెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన శనివారం ఉదయం ఏలూరులోని రెవెన్యూ అసోసియేషన్ భవన్ లో నిర్వహించిన ఎన్నికల్లో ఏలూరు జిల్లా నూతన అధ్యక్షునిగా కలిదిండి గ్రామ రెవెన్యూ అధికారి జి. గంగాధరరావును అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్.మురళీకృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ అధికారులకు ఎటువంటి సమస్య వచ్చినా సంఘటితంగా ఉద్యమించి దాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.కృష్ణమూర్తి,ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర సెక్రటరీ జనరల్ వైవి.రావు,ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆర్ వి రాజేష్, ఏలూరు జిల్లా అధ్యక్షులు కే.రమేష్ కుమార్ ,జిల్లా కార్యదర్శి ఏ.ప్రమోద్ పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఇదే…ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఏలూరు జిల్లా సహాధ్యక్షులుగా సాల్మన్ రాజు, ఉపాధ్యక్షునిగా కే.చంద్రశేఖర్, కే. ప్రసాద్, ఎం.తారకేష్ ,ఎస్ కె. అక్బర్ ,ప్రధాన కార్యదర్శిగా ఎస్.మురళీకృష్ణ, సహాయ కార్యదర్శులుగా బి.ఆర్ సుబ్బారావు, టి. రాజారత్నం స్వామి, కె.ప్రసాద్, టి.సుధాకర్, కోశాధికారిగా ఎస్.సింహాద్రి ,ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, బి. ఏడుకొండలు, వై.వేణుగోపాల్, బి.శివకుమార్ ,క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా భరత్ ,రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రాజాబాబు,ఏ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా పి.శేఖర్, ఈసీ సభ్యులుగా ఎన్ వకులాదేవి, వీర్రాజు,డివిడి ప్రసాదు,ఆర్. సత్యనారాయణ ఎన్నికయ్యారు.