PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏనుగులు మీద‌కొచ్చేస‌రికి భ‌యం వేసింది

1 min read

పల్లెవెలుగు వెబ్​ : రానా క‌థ‌నాయ‌కుడిగా.. మాన్, ఎనిమల్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతోన్న చిత్రం “అర‌ణ్య”. ప్రభు సాల్మన్ ద‌ర్శకుడు. ఈనెల 26న అర‌ణ్య సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌కాబోతోంది. భ‌విష్యత్ త‌రాల‌కు మంచి జ‌రిగే క‌థ‌తో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నామ‌ని తెలిపారు హీరో రానా. ఏనుగుల ద్వార అడ‌వుల విస్తీర్ణం పెరుగుతుంద‌ని.. ఫ‌లితంగా జీవ‌కోటికి వెల‌క‌ట్టలేని లాభం చేకూరుతుంద‌ని తెలిపారు. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేయాల‌న్న సంక‌ల్పంతోనే అర‌ణ్య సినిమా చేశానని తెలిపారు. ఈ సినిమాలో రానా నరేంద్ర భూప‌తి అనే క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. అచ్చం అడ‌వి మ‌నిషిలా త‌న రూపాన్ని మార్చేసుకున్నాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా థాయిలండ్ జూలో అడువుల‌తో స్నేహం చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఏనుగుల‌కు ఆహారం ఇవ్వడం, స్నానం చేయించ‌డం లాంటి ప‌నుల ద్వార మ‌చ్చిక చేసుకున్నట్టు రానా తెలిపారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఏనుగులు గుంపు త‌న ద‌గ్గరికి వ‌చ్చేస‌రికి .. చాలా భ‌యం వేసేద‌ని రానా చెప్పుకొచ్చారు. సాధార‌ణంగా ప్రేమ కోసం, రాజ్యాల కోసం యుద్ధం చేసిన‌ క‌థ‌లున్నాయి కానీ… అడ‌వి కోసం యుద్ధం చేసే ఇలాంటి క‌థ‌లు చాలా అరుదుగా ఉన్నాయని అన్నారు. ఇది భ‌విష్యత్ త‌రాల‌కు మంచి చేసే క‌థ‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.

About Author