టీఆర్ఎస్ కేబినెట్ మొత్తం టీడీపీనే..
1 min readపల్లెవెలుగు వెబ్ : తాను తెలుగుదేశం పార్టీకి చెందినవాడైతే.. సీఎం కేసీఆర్ ఏ పార్టీవారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సహా కేబినెట్ మొత్తం టీడీపీనే కదా ? అని అన్నారు. కేటీఆర్ రేవంత్ పై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. కేసీఆర్, పోచారం, ఎర్రబెల్లి, గంగుల, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ ఇలా సీఎంతో సహా మంత్రుల్లో చాలా మంది తెలుగుదేశం వారేనని వ్యాఖ్యానించారు. విధిలేక ఎల్. రమణను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటున్నారని విమర్శించారు. కేటీఆర్ మాదిరిగా వారసత్వంగా పదవి తెచ్చుకోలేదని, కష్టపడి పీసీసీ అధ్యక్షుడి పదవి తెచ్చుకున్నానని అన్నారు. పార్టీని విలీనం చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారని అన్నారు.