రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పాలన అంతం కావాలి.. టిడిపి
1 min read– రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు మహిళలకు పెద్దపీట వేశారు..
– రాష్ట్రంలో దుష్ట పాలన అంతం కావాలి..
– టిడిపి పార్టీ మహిళలు ఆగ్రహం..
– ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై తెలుగు దేశం పార్టీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోతుందని తెలుగు మహిళలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పాలన అంతం కావాలని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు ఏలూరు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వసంతమహాల్ సెంటర్లోని కనకదుర్గమ్మ కు పూజలు చేసి ప్రారంభించిన ప్రదర్శన పాత బస్టాండ్ సెంటర్ వరకు జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మరియు తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, జిల్లా అధికార ప్రతినిధి కడియాల విజయలక్ష్మి చౌదరి, నగర అధ్యక్షులు తవ్వా అరుణ్ కుమారి, కార్యదర్శి పిళ్ళారిశెట్టి సంధ్య తదితరులు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు మహిళల సంక్షేమానికి పెద్దపేట వేసారని, చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక, సామాజికంగా ప్రగతి సాధించేందుకు బాటలు వేశారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారులకు వచ్చిన జగన్ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ రోజు చూసినా మహిళలపై అత్యాచారాలు హత్యలు అరాచకాలు జరుగుతున్న నిందితులకు ఎటువంటి శిక్ష పడడం లేదని, బాధితులే శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాలన అంతం అయ్యేవరకు పోరాడుతామని హెచ్చరించారు. అనంతరం బడేటి క్యాంపు కార్యాలయంలో బడేటి చంటి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వారికి జరుగుతున్న అన్యాయంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.