ఈవీఎం కమీషనింగ్ ప్రక్రియ విజయవంతం
1 min read– రిటర్నింగ్ అధికారి మరియు రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ::
పల్లెవెలుగు వెబ్, బద్వేలు: ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు 124 బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా ఈవీఎం/ వివి ప్యాట్ కమీషనింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా చేసి విజయవంతం చేయడం జరిగిందని బద్వేల్ ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ అన్నారు. ఆదివారం బద్వేలు బాలయోగి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో 124 బద్వేల్ (ఎస్సీ) నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈనెల 30వ తేదీన జరుగుతున్న సందర్భంగా ఈవీఎం/ వివి ఫ్యాట్ ల కమీషనింగ్ ప్రక్రియను బద్వేలు ఉప ఎన్నికల సాధారణ పరిశీలకులు భీష్మ కుమార్, ఐ.ఏ.ఎస్.,గారు, జేసి ఎం.గౌతమి, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజంట్స్ సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ… ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలు, సూచనల, ఆదేశాల మేరకు ఈవీఎం/ వివి ఫ్యాట్ కమీషనింగ్ ప్రక్రియ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ప్రత్యేక దృష్టితో పూర్తి చేశామన్నారు. ఈ ఈవీఎం/ వి వి ఫ్యాట్ కమీషనింగ్ ప్రక్రియ కార్యక్రమానికి 38 టేబుల్స్ ఏర్పాటు చేయడంతోపాటు అందులోనే 10 టేబుల్స్ రిజర్వ్ చేసి ఉంచడం జరిగిందన్నారు. కమీషనింగ్ లో ప్రతి రౌండ్ ను జాగ్రత్తగా చేయాలని, ఈవీఎం/ వివి ఫ్యాట్ లో అన్ని కనెక్షన్ వైర్లు ఉన్నాయా.. లేవా, కనెక్షన్స్ సరిగా చేశామా లేదా అని నిర్ధారించుకోని ఏ సమస్య లేకుండా కమీషనింగ్ పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించడంతోపాటు పూర్తి కార్యక్రమం ముగేసేంతవరకు స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. అనంతరం మాక్ పోల్ ప్రక్రియ కార్యక్రమం చేసి ఈవిఎం/ వివి ప్యాట్స్ లోని సమాచారం క్లియర్ చేసి నిర్దేశించిన స్ట్రాంగ్ రూమ్ కు పంపి భద్రపరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఉప ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు రెడ్డి, తాహశీల్దార్లు సుబ్రమణ్యం రెడ్డి, శివరామిరెడ్డి, విజయ్ కుమార్, జీవన్ చంద్ర శేఖర్,మధు సూధన్ రెడ్డి, సెక్టరోల్ అధికారులు, బిఎల్ఓలు, టెన్నికల్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.