కేంద్రానికి షాక్.. ఆందోళన విరమించమన్న రైతులు
1 min read
పల్లెవెలుగు వెబ్: ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు మరోసారి కేంద్రానికి షాక్ ఇచ్చారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు కేంద్రం ప్రకటించినా… ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. బీకేయూ నేత రాకేష్ టికాయత్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలను విధిగా రద్దు చేసిన తర్వాతే.. ఆందోళన విరమింపు, సరిహద్దుల నుంచి కదిలే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తదుపరి కార్యాచరణకు సంబంధించి రేపు రైతు సంఘాల నేతలు సమావేశమైతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కనీస మద్దతు ధర పెంపుపైనా ఓ నిర్ణయం తీసుకోవాలని.. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని టికాయత్ స్పష్టం చేశారు. కాగా, ప్రధాని ప్రకటనతో సింఘా సరిహద్దులో రైతులు సంబరాలు చేసుకున్నారు.