ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఎంతో అభినందనీయం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు నిజమైన సెక్యులర్ లీడర్ శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డినగర వైఎస్ఆర్సిపి ముస్లిం మైనారిటీ అధ్యక్షులు శ్రీ పత్తా భాష మరియు ఇతర ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు నగరంలోని కుబు సూరత్ బడే సాహెబ్ మజీద్ ( లాల్ మసీద్ దగ్గర ) ఏర్పాటుచేసిన ఇఫ్తార్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక ప్రార్థన లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడ కొరకు ముస్లిం సోదరులు చేసే ఉపవాస దీక్షలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో మైనారిటీ నగర అధ్యక్షులు పత్త బాషా, 10వ వార్డ్ కార్పొరేటర్ యూనిస్ భాష, బాబు,షైక్ షా, వలి, జిల్లా మరియు నగర అనుబంధ అధ్యక్షులు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.