తండ్రి కర్మకాండ కు వెళ్లి వస్తు తిరిగిరాని లోకాలకు
1 min read– చెన్నూరు ఆంధ్ర స్పైస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
– ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
– ఇద్దరికీ తీవ్ర గాయాలు
– శతఘాతృలను రక్షించడంలో పోలీసుల కీలకపాత్ర
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : (తెలంగాణ ) హైదరాబాద్( ఖైరతాబాద్)కు చెందిన ఓ కుటుంబంలోని యజమాని తిరుపతిలో మరణించగా ఆయన కర్మకాండ కు వెళ్లి తిరిగి హైదరాబాదుకు వెళుతుండగా వైయస్సార్ జిల్లా చెన్నూరు కడప -కర్నూలు జాతీయ రహదారి గోసుల కళ్యాణమండపం సమీపంలో( ఆంధ్ర స్పైస్) వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, హైదరాబాద్( ఖైరతాబాద్) కు చెందిన కొండేటి కృష్ణ తండ్రి తిరుపతిలో మరణించడంతో ఆయన కర్మకాండకు కుటుంబంతో వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళుతుండగా కడప- కర్నూలు జాతీయ రహదారి చెన్నూరు ఆంధ్ర స్పైస్ సమీపంలో రోడ్డు పక్కన చెట్ల కింద నిలబడి ఉన్న లారీని వెనుక వైపు ఢీ కొని, లారీ కిందికి దూసుకుపోవడంతో ఈ సంఘటనలో కొండేటి కృష్ణ వయసు( 48) సంవత్సరాలు కృష్ణ అత్త పద్మావతి వయస్సు( 60) సంవత్సరాలు , కృష్ణ కుమారుడు రిషి వయసు(15 ) సంవత్సరాలు ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందగా, కృష్ణ భార్య విజయ రాణి, వయసు( 38 )సంవత్సరాలు, కుమార్తె నిహారిక వయసు (19 ) సంవత్సరాలు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు, కాగా మృతుడు కృష్ కుమారుడు రిషి పదవ తరగతి చదువుతూ ఉన్నాడని కుమార్తె నిహారిక ఓ కాలేజీలో లాంగ్ టర్న్ కోచింగ్( మెడిసిన్ ) చేస్తున్నదని తెలిపారు, అయితే వీరంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారు, తమిళనాడుకు చెందిన లారీ ఉప్పులోడుతో హైదరాబాదులోని తిమ్మాపూర్ కు వెళుతూ చెన్నూరు ఆంధ్ర స్పైస్ సమీపంలో చెట్ల వద్ద పక్కన నిలబెట్టుకొని డ్రైవర్ వంట చేసుకుంటూ ఉండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు..
క్షతగాత్రులను రక్షించడంలో చెన్నూరు పోలీసుల కీలక పాత్ర…..
కడప -కర్నూల్ జాతీయ రహదారి చెన్నూరు ఆంధ్ర స్పైస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలియగానే ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తమ సిబ్బందితో సంఘటన స్థలానికి లారీ కింద ఇరుకున్న కారును లాగి అక్కడి శతగాత్రులను హుటాహుటిన 108 లో కడప రిమ్స్ కు తరలించారు.