PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నగరంలో ‘కలియుగం పట్టణంలో’ చిత్ర బృందం సందడి

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: నగరంలో ‘కలియుగం పట్టణంలో’ చిత్ర బృందం సందడి చేసింది.క్రైమ్, థ్రిల్లర్ ,లవ్, మదర్ సెంటిమెంట్ తో కలియుగ పట్నంలో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆ చిత్ర కథానాయకులు విశ్వ కార్తికేయ, హీరో నరేన్ రామ్ తెలిపారు.కలియుగం పట్టణంలో చిత్రం ప్రమోషన్ లో భాగంగా మురళి ఫార్చ్యూన్ రోడ్ లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా  కథానాయకుడు విశ్వ కార్తికేయ మాట్లాడుతూ కనకదుర్గమ్మ దర్శనంతో తమ చిత్రం ప్రమోషన్ ప్రారంభించామని కళాశాల విద్యార్థులతో తమ చిత్ర విశేషాలు ముచ్చట్టించిన సమయంలో వారి నుంచి వచ్చిన స్పందన ఎంతో సంతోషంగా ఉందన్నారు.క్రైమ్, థ్రిల్లర్, లవ్ ఎలిమెంట్స్ తో చిత్రం ఉంటుందన్నారు.బాల నటుడిగా ఎన్నో చిత్రాలలో నటించాననీ చెప్పారు.ఎన్నో క్రైమ్ సినిమాలు వచ్చి ఉంటాయి కానీ వీటన్నిటికీ విభిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు.మార్చి 29 న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుందనీ ,ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.ఇప్పటికే  విడుదలన  ట్రైలర్ కు విశేష స్పందన లభించిందన్నారు. కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చు అని తెలిపారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని వివరించారు.అనంతరం సహ హీరో నరేన్ రామ్ మాట్లాడుతూ సీనియర్ నటుడు గుమ్మడి మనవుడుని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అని,తమిళ భాషల్లో ఇప్పటికే రెండు చిత్రాలలో నటించాననీ చెప్పారు.తెలుగులో ఇది తనకు తొలిచిత్రం అని, తన మాతృభాష అయినా తెలుగు ఇండస్ట్రీలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఇందులో క్రైమ్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయన్నారు.అనంతరం దర్శకుడు రమణ కాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం క్రైమ్, థ్రిల్లర్ ,లవ్, మదర్ సెంటిమెంట్ తో ఉంటుందన్నారు.ఈ చిత్రాన్ని చాలెంజింగా తీశాననీ,ఈ చిత్రంలో ఉన్న క్రైమ్ సన్నివేశాలు యువత ఎవరు ఇన్స్పిరేషనల్ గా తీసుకోవద్దన్నారు.కేవలం చిత్రం కోసం మాత్రమే కల్పిత పాత్రలు, వాటిని ఎవరు ఫాలో అని మనవి చేసుకుంటున్నానని అన్నారు.ప్రేక్షకులు అందరూ థియేటర్ల వద్దకు వచ్చి చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అనంతరం హీరోయిన్ ఆరుషి మాట్లాడుతూ  ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులను కచ్చితంగా నచ్చుతుందన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయం చేసి ఆదరించాలని ఆమె కోరారు.విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

About Author