అమెరికాలో తొలి క్రికెట్ మ్యాచ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : అమెరికాలో క్రికెట్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు త్వరలో తొలి ప్రొఫెషనల్ టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ల కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో పాటు ఇండో-అమెరికన్ వ్యాపార వేత్తలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 100 కోట్లకు మందికి పైగా ప్రజలు క్రికెట్‌ను అభిమానిస్తున్నప్పటికీ, కొన్ని దేశాల్లో మాత్రమే ఇది పాపులర్ అయ్యింది. అలాంటి జెంటిల్ గేమ్ క్రికెట్ మ్యాచ్‌లు ఇకపై అమెరికాలో జరగనున్నాయి. ఇందుకోసం సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాస్‌లు కో ఫౌండర్‌లుగా పలు దిగ్గజ కంపెనీలకు చెందిన యజమానులు, సీఈవోలు సంయుక్తంగా మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)ను ప్రారంభించారు. ఈ లీగ్ సంస్థలో సత్య నాదెళ్ల ప్రధాన పెట్టుబడిదారుడిగా ఉన్నారు.