మంకీపాక్స్ తొలి మరణం !
1 min read
పల్లెవెలుగువెబ్ : మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి వారం గడవక ముందే మరిన్ని దేశాలకు వైరస్ విస్తరించింది. తాజాగా ప్రపంచంలో బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం రికార్డు అయ్యింది. మంకీపాక్స్ మొదటగా వెలుగు చూసింది ఆఫ్రికాలోనే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆఫ్రికా దేశాల్లోనే అత్యధిక మంకీపాక్స్ కేసులు, మరణాలు సంభవించాయి. అయితే తొలిసారిగా ఓ బయటిదేశంలో మంకీపాక్స్ మరణం నమోదు కావడం విశేషం. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌లో 41 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ తో మరణించాడని అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు.