ఏపీలో తొలి డెల్టా ప్లస్ కేసు..మంత్రి వెల్లడి
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీలో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. కొన్ని రోజుల ముందు తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైందని తెలిపారు. డెల్టా ప్లస్ సోకిన వ్యక్తికి చికిత్స పూర్తయింద ని, ఆ వ్యక్తి నుంచి ఎవరికీ డెల్టాప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందలేదని చెప్పారు. డెల్టా ప్లస్ వేరియంట్, బ్లాక్ ఫంగస్ వ్యాధుల నుంచి అప్రమత్తంగా ఉండాలని, అందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కరోన ఎదుర్కునేందుకు అధికారులు అప్రమత్తం ఉండాలని తెలిపారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.