PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో తొలి మొబైల్ సినిమా థియేట‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మొబైల్ థియేట‌ర్ ను తూర్పుగోదావ‌రి జిల్లా రాజానగ‌రంలో నిర్మిస్తున్నారు. ఇది ఏపీలోని మొట్ట‌మొద‌టి మొబైల్ థియేట‌ర్. తెలంగాణ‌లో ఇలాంటిది ఒక‌టి నిర్మించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న హాబిటేట్‌ ఫుడ్‌కోర్టు ప్రాంగణంలో ఈ థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ మొబైల్‌ థియేటర్‌ను ఢిల్లీకి చెందిన పిక్చర్‌ డిజిటల్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 23న థియేటర్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి చైతన్య తెలిపారు.

మొబైల్ థియేట‌ర్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే :
గాలిని నింపే బెలూన్ల వంటి షీట్లను అమర్చి ఓ షామియానా (టెంట్‌) మాదిరి మొబైల్‌ థియేటర్‌ను తయారు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను, అగ్ని ప్రమాదాలను తట్టుకునే టెక్నాలజీ వినియోగిస్తున్నారు. 120 సీట్ల సామర్థ్యం ఉంటుంది. బయట నుంచి చూస్తే గాలి నింపుకుని కలర్‌ ఫుల్‌గా ఉన్న ఓ సెట్టింగ్‌లా ఈ థియేటర్‌ కనిపిస్తుంది. సులువుగా తరలించేందుకు వీలుగా ఈ థియేటర్‌ తయారీలో ప్లాస్టిక్, స్పాంజ్‌లను అధికంగా వినియోగిస్తున్నారు. ఓ ట్రక్కులో దీనిని తరలించవచ్చు.

                                        

About Author