ఇండియాలో తొలి మంకీపాక్స్ కేసు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇటీవల యూఏఈ నుంచి కేరళ వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అతడిని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచిన అధికారులు నమూనాలు సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. తాజాగా, వచ్చిన ఫలితాల్లో అతడికి మంకీపాక్స్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ తెలిపారు.