NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో మొద‌టి పీడీ యాక్ట్ కేసు న‌మోదు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : గుంటూరు జిల్లాలో తొలి పీడీయాక్ట్ కేసు న‌మోద‌యింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ స‌ర‌ఫ‌రా చేస్తున్న యర‌మాసు రామ‌కోటేశ్వరావు పై పీడీ యాక్టు అమలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హ‌ఫీజ్ ప్రక‌టించారు. తెలంగాణ నుంచే కాకుండా గోవా నుంచి కూడ అక్రమ మ‌ద్యం రామ‌కోటేశ్వర‌రావు త‌ర‌లిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. లిక్కర్ అక్రమ‌ ర‌వాణ చేస్తూ మూడు సార్లు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. పీడీ యాక్ట్ అమ‌లుకు క‌లెక్టర్ నుంచి అనుమ‌తి తీసుకున్నట్టు ఎస్పీ ఆరీఫ్ హ‌ఫీజ్ తెలిపారు. ప్రభుత్వం జీవో కూడ ఇచ్చింద‌న్నారు. రామ‌కోటేశ్వర‌రావును అరెస్టు చేసి.. కేసు న‌మోదు చేశామ‌ని ఎస్పీ వెల్లడించారు. అనంత‌రం రాజ‌మండ్రి జిల్లా జైలుకు పంపుతామ‌ని పేర్కొన్నారు. అసాంఘిక కార్యక‌లాపాల‌కు పాల్పడేవారికి ఇదో హెచ్చరిక కావాల‌ని ఎస్పీ ఆరీఫ్ హ‌ఫీజ్ అన్నారు.

About Author