NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశంలో తొలి క‌రోన సోకిన వ్యక్తికి.. మళ్లీ క‌రోన సోకింది !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : దేశంలో తొలి క‌రోన వైర‌స్ సోకిన వ్యక్తికి మ‌ళ్లీ వైర‌స్ సోకింది. భార‌త్ లో తొలి క‌రోన సోకిన వ్యక్తిగా రికార్డుల‌కెక్కిన కేర‌ళ మ‌హిళ‌కు.. మ‌రోసారి క‌రోన బారిన ప‌డ్డట్టు వైద్యాధికారులు తెలిపారు. యాంటీజెన్ పరీక్షల్లో నెగిటివ్ వ‌చ్చినప్పటికీ ఆర్టీపీసీఆర్ లో మాత్రం పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ప్రస్తుతం ఆమెలో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని కేర‌ళ‌లోని త్రిస్సూర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కేజే రీనా తెలిపారు. ఉన్నత చ‌దువుల కోసం ఢిల్లీ వెళ్లనున్న సంద‌ర్భంగా ఆమెకు క‌రోన ప‌రీక్షలు నిర్వహించారు. ఈ ప‌రీక్షల్లో ఆమెకు పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆమెను హోమ్ ఐసోలేష‌న్ లో ఉంచారు. ప్రస్తుతం ఆమెలో ఎలాంటి ల‌క్షణాలు లేవ‌ని డాక్టర్ కేజే రీనా తెలిపారు.

About Author