పారదర్శకంగా మొదటి దశ ఈవిఎం, ర్యాండమైజేషన్ పూర్తి
1 min readజిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పారదర్శకంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి దశ ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులైన నెరుసు నెలరాజు(బిజేపి), ఎస్ బి ప్రసాద్(కాంగ్రేస్), ఉండవల్లి బాలానందం(టిడిపి), డి. సూర్యచంద్రరావు(వైఎస్ఆర్ సిపి), ఎన్. కాశీనరేష్(జనసేన) తదితరులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.ఎన్నికల కమీషన్ నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని అన్నారు. ఏలూరు జిల్లాలో 1743 పోలింగ్ స్టేషన్లకు గాను 4184 బ్యాలెట్ యూనిట్లు, 4184 కంట్రోల్ యూనిట్లు, 4534 వివిప్యాట్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు 20 శాతం, వివి ప్యాట్లు 30 శాతం అధనంగా కేటాయించడం జరుగుతుందని వీటిని కలిసి ర్యాండమైజేషన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్ లైన్ విధానం ద్వారా చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, నోడల్ అధికారి కె.వెంకటేశ్వరరావు,డి అర్ డి ఎ పిడి ఆర్.విజయరాజు,తదితరులు పాల్గొన్నారు.