సుపరిపాలనలో తొలి అడుగు …
1 min read
సి బెళగల్, న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు , మరియు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు ,కెడీసీసీ చేర్మెన్ డి విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో 10వ రోజు సి బెళగల్ మండలం బురాన్ దొడ్డి గ్రామం నందు బూత్ నెంబర్ 159,160 లో బెళగల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గ. ప్రతినెల ఒకటో తేదీన్నే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వృద్ధులు,వితంతువులకు 4000 రూపాయలు,దివ్యాంగులకు,కుష్టి వ్యాధిగ్రస్తులకు 6000 పూర్తి వైకల్యం ఉన్నవారికి 15వేల రూపాయలను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా దీపం పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో 15 వేల రూపాయలను జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా రైతు సంక్షేమం కింద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాబోయే రోజుల్లో 20000 రూపాయలను జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ,అలాగే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం మండల కన్వీనర్ చంద్రశేఖర్, పోలకల్ అమర్, ఎంపీటీసీ ఈరన్న గౌడ్, బురాన్ దొడ్డి రాంమోహన్ రెడ్డి, సర్పంచ్ రామాంజినేయులు, స్కూల్ చేర్మెన్ ముందరింటి గోవిందు,తెలుగుయువత హరి,డిస్స్ వెంకటేష్, ధనుంజయ, వడ్డె వీరేష్ మరియు మండల నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు మరియు బూత్ కన్వీనర్లు,బూత్ ఇంచార్జీలు,గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.