బండలాగుడు పోటీల్లో మొదటి విజేత…
1 min read
పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
బహుమతులను అందజేసిన మాండ్ర..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి.ఈ పోటీల్లో 10 జతలు పాల్గొన్నాయి.ముందుగా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు గ్రామ టీడీపీ నాయకులు కమతం రాజశేఖర్ రెడ్డి మరియు రైతులు ఘన స్వాగతం పలికారు.వీరభద్ర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు.ఎద్దుల పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఉగాది, రంజాన్,శ్రీరామ నవమి,గుడ్ ఫ్రైడే సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ రెడ్డి తెలిపారు.పోటీల్లో గెలుపొందిన వృషభ రాజుల యజమానులకు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, కమతం రాజశేఖర్ రెడ్డి,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి బహుమతులను అందజేశారు.మొదటి విజేతగా వరలక్ష్మి-బి తండ్రపాడు 40 వేలు,రెండవ విజేత గద్వాల జిల్లా కంచుపాడు అంజిరెడ్డి-30 వేలు మొత్తం ఎనిమిది విజేతలకు నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,వైస్ చైర్మన్ సుధాకర్ యాదవ్, బిజినవేముల సర్పంచ్ రవి యాదవ్,వెంకటేశ్వర రెడ్డి,నాగేంద్రుడు,చాకర్ వలి, గోవర్ధన్ రెడ్డి,ఇద్రిస్,నరసింహ గౌడ్,షబ్బు,సర్వోత్తమ్ రెడ్డి,కమతం జయరామి రెడ్డి,వీరారెడ్డి,మండల యువ నాయకులు యరభం ప్రమోద్ రెడ్డి,ఐటీడీపీ ఇంతియాజ్ పాల్గొన్నారు.
