తొలి మహిళా ప్రధాని.. ఇందిరా గాంధీ 106వ జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఉక్కు మహిళ ఐరన్ లేడీ భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ నూట ఆరవ జయంతి సందర్భంగా నేడు ఆలూరు నియోజకవర్గం హో లాగుంద మండలం లో కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా ఆధ్వర్యంలో శ్రీమతి ఇందిరా గాంధీకి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎం. అమానుల్లా మాట్లాడుతూ ఈ దేశానికి 16 సంవత్సరాలు పాటు ప్రధాన మంత్రిగా పనిచేసే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు అనేక సంస్కరణలు చేశారని అమానుల్లా చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా భూమిలేని పేదలకు భూ పంపిణీ ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించారని అదేవిధంగా గరీబీ హటావో నినాదంతో పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు శ్రీమతి ఇందిరా గాంధీ ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందని అమానుల్లా తెలియజేయడమైనది. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 14 ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారని పేద ప్రజలందరికీ బ్యాంక్ సేవలు దగ్గర చేశారని. అదేవిధంగా 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు అమ్ములు చేశారని ఆమె తుది రక్తపు బొట్టు వరకు ఈ దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం అర్పిస్తారని చెప్పి తన ప్రాణ త్యాగం చేసిన గొప్ప మహిళగా పేరు పొందారని అమానుల్లా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సీనియర్ నాయకులు పీ రా సా భ్. ఖలీల్ సాబ్. ఖాజా సా బ్. ఖాజా మోదీ న్. వీరన్న గౌడ్. కురువ ఈరన్న. బోయ సిద్ధప్ప. ఎరుకుల శేఖర్. పింజారి మెహబూబ్ భాష. హాల హరివి చినిగి సాబ్. కుంబారు ఈరన్న అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.