అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం
1 min read
పల్లెవెలుగువెబ్ : మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్ తో ఆయన బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆయన కరోనాతో ఆసుపత్రిలో చేరానన్న ప్రచారాన్ని ఆసుపత్రి వైద్యులు ఖండించారు. ఎస్ఎం కృష్ణ వయసు 90 ఏళ్లు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న ఆయనను గతరాత్రి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.