పూర్వ వైభవం ఉర్దూ భాషకు తీసుకురావాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: ఉర్దూ భాష కు సంబంధించి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం జరిగిందని మండల కో ఆప్షన్ నెంబర్ వారీష్ అన్నారు, బుధవారం ప్రపంచవృతి దినోత్సవం సందర్భంగా చెన్నూరు చక్కెర చెట్టు వద్ద ఉన్న ఉర్దూ పాఠశాలలో ప్రపంచ ఉర్దూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారిష్ మాట్లాడుతూ , స్వాతంత్రం రాక మునుపు, తరువాత ఉర్దూ భాషకు ఎంతో ప్రాధాన్యత ఉండేదని, రాను రాను ఆ భాషకు పూర్వ వైభవం తగ్గిందని ఆయన అన్నారు, అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉర్దూ భాషలు రెండవ అధికార భాషగా తీసుకురావడం ఎంత సంతోషకరమన్నారు, “సారే జహాసే అచ్చా” ఉర్దూ జాతీయ గీతాన్ని రచించిన డాక్టర్ అల్లా మహమ్మద్ ఇక్బాల్ జన్మదినమైన నవంబర్ 9న ప్రపంచ ప్రపంచ ఉర్దూ భాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు, డాక్టర్ అల్లా మహమ్మద్ ఇక్బాల్, ప్రముఖ ఉర్దూ రచయితనే ఉర్దూ రచయితనే కాకుండా, ఆయనలో మహా కవి దాగి ఉన్నారని, ఉర్దూ భాషకు ఎంతో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో, మైనార్టీ నాయకులు హస్రత్, రఫీక్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు , విద్యార్థులు పాల్గొన్నారు.