పింఛన్ కు పునాది..దామోదరం సంజీవయ్య
1 min read
పట్టణంలో భారీ ర్యాలీ ఘనంగా జయంతి వేడుకలు..
పల్లెవెలుగు , నందికొట్కూరు: పింఛన్లకు మొట్ట మొదటి సారిగా పునాది వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కీ.శే దామోదరం సంజీవయ్య అని దళిత సంఘం నాయకులు అన్నారు.సంజీవయ్య 104వ జయంతి వేడుకలు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఘనంగా జరిగాయి.ఈ వేడుకలు శుక్రవారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.పట్టణంలోని అంబేద్కర్ కూడలి నుండి ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు.తర్వాత ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఏడిఏ అశోక్ రత్నం,మాల మహానాడు జాతీయ నాయకులు తాళ్లపల్లి రవి, యాట ఓబులేష్,వేల్పుల జ్యోతి,డాక్టర్ రాజు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో దళిత పేదరిక కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించాలని ఆయన సేవలను వారు కొనియాడారు.నందికొట్కూరు పట్టణంలో సంజీవయ్య విగ్రహం ఏర్పాటు చేయిస్తానని అశోక రత్నం అన్నారు.మొట్ట మొదటి సరిగా 30 రూ.తో పింఛన్ అమలు చేశారని ఆయన చేసిన పనులు చాలా గొప్పగా ఆదర్శనీయంగా ఉన్నాయని 39 సం.ల వయసులోనే సీఎంగా భారతదేశంలోనే మొదటి ముఖ్యమంత్రిగా 6 లక్షల ఎకరాల భూమిని భూ పంపిణీ చేసి చరిత్ర సృష్టించారని వారు కొనియాడారు.తర్వాత మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిధులు మరియు నందికొట్కూరు పట్టణ,రూరల్ సిఐలు వై ప్రవీణ్ కుమార్ రెడ్డి,టి సుబ్రహ్మణ్యం,ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు,తమ్మడపల్లి విక్టర్,జయరాముడు,రాజ్ కుమార్ బహుమతులను అందజేశారు.కమిటీ సభ్యులు అతిధులను శాలువా మెమెంటోలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లాలు ప్రసాద్,శివ ప్రసాద్,డాక్టర్ వనజ,షకీల్ అహ్మద్,వేల్పుల విజయ్,నాగరాజు,గుంపుల వెంకటేశ్వర్లు,శ్రీధర్,మాజీ ఏఎస్ఐ జాన్,ఏసేపు తదితరులు పాల్గొన్నారు.
