NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాలుగో రోజూ న‌ష్టాలే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: దేశీయ స్టాక్ మార్కెట్లో నాలుగో రోజు న‌ష్టాలే మిగిలాయి. ఒక్క బ్యాంక్ నిఫ్టీ త‌ప్ప మిగిలిన కీల‌క సూచీలైన నిప్టీ, సెన్సెక్స్ లు న‌ష్టాల్లో ముగిసాయి. ఉద‌యం సానుకూలంగా ప్రారంభ‌మైన సూచీలు.. అనంత‌రం న‌ష్టాల్లో ముగిసాయి. ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టాక్స్ లాభాల్లో కొన‌సాగిన నేప‌థ్యంలో బ్యాంక్ నిఫ్టీ లాభాల్లో ముగిసింది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా క‌ద‌ల‌గా.. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ప్రారంభ‌మ‌య్యాయి. కీల‌క రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు న‌ష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 101 పాయింట్ల న‌ష్టంతో 60,821 వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 63 పాయింట్ల న‌ష్టంతో 18,114 వ‌ద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 293 పాయింట్ల లాభంతో 40,323 వ‌ద్ద ముగిసింది.

About Author