రుద్రపాదం పై పిండ ప్రధానం మహా పుణ్యఫలం
1 min read– రుద్రపాద పరిరక్షణ సేవాసమితి అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : దక్షిణ కాశీగా పేరు అందిన పుష్పగిరి పుణ్యక్షేత్రంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ సమీపంలో పినాకిని నది ఒడ్డున వెలిసిన రుద్రపాదం పై పరమపదించిన పితృదేవతల పేరుతో పిండ ప్రదానం చేస్తే మహా పుణ్యఫలం సిద్ధిస్తుందని రుద్రపాద పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు పుణ్యభూమి చార్ల బ్రష్ చైర్మన్ సాయినాథ్ శర్మ అన్నారు. మంగళవారం నాడు రుద్రపాదం పై పిండ ప్రధాన నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించడానికి పుష్పగిరికి వచ్చిఆయన విలేకరులతో మాట్లాడారు ఈ నెల 14 న మహాలయ అమావాస్య సందర్భంగా రుద్రపాదం వద్ద స్వర్గస్తులైన పితృ దేవతలకు సామూహిక పిండ ప్రధానం చేయడం వల్ల పుణ్య ఫలం సిద్ధిస్తుందన్నారు. ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సంవత్సరాలుగా రుద్రపాదం వద్ద సామూహిక పిండ ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తున్నా మన్నారు. అయితే ,ఈ సంవత్సరం ఆలయ కమిటీ పిండ ప్రధాన కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు రావడాన్ని రుద్రపాదపరిరక్షణ కమిటీ తరుపున అభినందనలు తెలుపుతున్నామన్నారు. పరమ పదించిన పితృ దేవతలకు పిండ ప్రధానం చేయడానికి ఇంకా అనేక మంది చైతన్య వంతులై ముందుకు రావాలన్నారు ఆలయ కమిటీ వారు పిండప్రదాన నిర్వహణకు ముందుకు రావడం మంచి పరిణామమన్నారు రుద్రపాదం వద్ద ఆలయ కమిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నందున తాము ఆలయం వెలుపల కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రుద్రపాదం వద్ద పిండ ప్రధానం జరిపితే మరణించిన వారి ఆత్మకు శాంతి మోక్షం చేకూరుతుందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు జనార్దన్, జనార్దన్ రెడ్ది, ఓబులరెడ్డి,రాజారెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.