NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భవిష్యత్​ మనదే…: భత్యాల

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి: కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల. వీరబల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. మనకూ మంచి రోజులొస్తాయని.. భవిష్యత్ మనదేనని హామీ ఇచ్చారు.ఇటీవల అనారోగ్యం బారిన పడి కోలుకున్న కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే కోలుకొని ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చి సానిపాయి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మనూరి కాలేశా వలి గారిని మరియు మట్టి గ్రామం ఎల్లంపల్లి నివాసి చిలకన్న ను బత్యాల పరామర్శించారు.ఈ కార్యక్రమంలో సానిపాయి మాజీ సర్పంచ్ నేతీ వెంకటరమణ మట్టి ,మాజీ సర్పంచ్ కొల్లి రమణ , తాటిగుంట పల్లి మాజీ ఉప సర్పంచ్ భాస్కర్ రాజు, గుదే నాగార్జున, నేతి రమేష్ బాబు, షేక్ చాన్ భాషా, అబ్బూరి వెంకటేష్ , హరి, నాగార్జున, సుధాకర్, గుగ్గిళ్ళ వెంకటేష్, చింతకుంట వెంకటేష్ , రామ్ నగర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

About Author