ఐదేళ్ల భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే.. టి.జి భరత్
1 min readటిడిపి పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమంలో పాల్గొన్న టి.జి భరత్, సోమిశెట్టి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఐదేళ్ల బంగారు భవిష్యత్తు ఎలా ఉండాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 11 వ వార్డులోని ఖడక్ పుర, మేదరి గేరి ప్రాంతాల్లో నిర్వహించిన తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమంలో టి.జి భరత్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ కర్నూలు నగర కమిటీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు చేపట్టిన నగరమా మేలుకో కార్యక్రమం పది వార్డుల్లో దిగ్విజయంగా పూర్తైందన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం, కర్నూలుకు తన నాయకత్వం ఎంతో అవసరమని చెబుతూ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారన్నారు. డెవలప్మెంట్ చేసే నాయకులు ఎవరో ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఒక్కసారి గుర్తించుకోవాలన్నారు. సరైన నాయకుడిని ఎన్నుకుంటే ఐదేళ్లపాటు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మెహబూబ్ ఖాన్, మన్సూర్ ఆలీఖాన్, అబ్బాస్, నౌషాద్, ఏసు, విజయలక్ష్మి, లలితమ్మ, నాగేశ్వరమ్మ, క్లస్టర్ ఇంచార్జీలు, వార్డు ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.