పట్టబద్రుల భవిత తెలుగుదేశం బాధ్యత
1 min read– రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పేద కుటుంబ విద్యార్థుల పట్ల శాసన మండలిలో తన గళం వినిపిస్తారని పట్టబద్రుల శాసన మండలి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని టిడిపి నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి పట్టబద్రుల ఓటర్లను కోరారు. శుక్రవారం నందికొట్కూరు మండలములోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మరియు వైష్ణవి ప్రవేట్ డిగ్రీ కాలేజీ, విజ్ఞాన్ ప్రవేట్ జూనియర్ కాలేజి , ప్రభుత్వ బాలికల హై స్కూల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ అసమర్ధ ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు రాక, అవకాశాలు లేక విసిగి వేసారిన గ్రాడ్యుయేట్ యువత తమ భవిష్యత్తు కోసం టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు.విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని దేశంలో 19వ స్థానానికి ఏపీలో విద్యావ్యవస్థను వైసీపీ నాయకులు దిగజార్చారన్నారు. యువత భవిష్యత్తును చిత్తు చేస్తూ డ్రగ్స్ కేరాఫ్ గా రాష్ట్రాన్ని మార్చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలండర్ అంటూ నిరుద్యోగ యువతను మోసం చేసారని ఆరోపించారు . అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారంటూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రాడ్యుయేట్లు వైసీపీ పాలనపై నిరసన గళాన్ని వినిపిస్తున్నారన్నారు. ప్రశ్నించే గళాన్ని శాసనమండలికి పంపుతాం అంటూ నినదిస్తున్నారన్నారు. మేం మోసపోయిన నిరుద్యోగులం టీడీపీని మాత్రమే నమ్మగలం అంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రాడ్యుయేట్లలో మార్పు వచ్చిందన్నారు. పట్టభద్రులు ఇకపై వైసీపీ కట్టుకధలు నమ్మబోరని ప్రశ్నించే గళాన్ని శాసనమండలికి పంపిస్తారన్నారు. పట్టభద్రుల భవిత తెలుగుదేశం బాధ్యత అని పేర్కొన్నారు.టిడిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమి రెడ్డి రాం గోపాల్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. నిరుద్యోగ యువతకు రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ రాక్షస పాలన నుండి విముక్తి కల్పించే ఎన్నికన్నారు. భుమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పులివెందుల వాసి గత కొన్ని సంవత్సరాలుగా జగన్ నేరచరిత్ర ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ఎలాంటి పదవి లేకున్నా మనకోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి ని అందరు కలిసి కట్టుగా ఉండి గెలిపించుకోవల్సిన బాధ్యత మనకు ఎంతైనా అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గుండం రమణా రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, కౌన్సిలర్ టిడిపి పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షకీల్ అహమ్మద్, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి, మాజీ కౌన్సిలర్ మూర్తు జావలి, పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు మహేష్ నాయుడు, రాష్ట్ర ఎస్సి సెల్ కో కన్వీనర్ జయసూర్య, టిడిపి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, పగడం సోమ శేఖర్, టిడిపి నాయకులు వేణు గోపాల్, కళాకర్, నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.