PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు

1 min read

– 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు నమోదు చేసుకోండి
– యువత ఓటు హక్కును తప్పకుండా నమోదు చేసుకొని వినియోగించుకోవాలి : జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : యువత చేతుల్లో దేశ భవిష్యత్తు ఉన్నందున 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు యువతకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో 13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, డిఆర్ఓ నాగేశ్వర రావు, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అనంతరం కేంద్ర ఎన్నికల ప్రధనాధికారి రాజీవ్ కుమార్ వీడియో సందేశాన్ని అందరూ తిలకించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లడుతూ నూతనంగా ఓటు నమోదు చేసుకున్న విద్యార్థులు ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కును సాధించుకోవడం కోసం ఎంతో మంది మహానుభావులు త్యాగం చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని యువత ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం యువతకే ఉందన్నారు. అందరూ ఓటు హక్కును గుర్తు ఎరిగి మసులుకోవాలన్నారు. మన భవిష్యత్తు తీర్చిదిద్దే నాయకులను మనం ఎన్నుకోవాలన్నారు. అదే విధంగా ఓటు హక్కును బాధ్యతయుతంగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు కోసం ప్రతి భారతీయుడు నమోదు చేసుకోవడం కోసం సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని చెప్పట్టడం జరుగుతుందన్నారు. ఓటు నమోదును ఎప్పుడైనా చేసుకోవచ్చన్నారు. గతంలో జనవరి 1వ తేది నాటికి 18 సంవత్సరాలు పూర్తైన వారికి ఓటు నమోదుకు అవకాశం ఉండేదని, ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెపుతూ సంవత్సరంలో 4 సార్లు అనగా జనవరి 1వ తేది, ఏప్రిల్ 1వ తేది, జూలై 1వ తేది, అక్టోబర్ 1వ తేది నాటి 18 సంవత్సరాలు పూర్తైన వారికి ఓటు నమోదుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున కేటాయించడంతో పాటు ఓటింగ్ ఉదయం 8గం.లకు ప్రారంభమై సాయంత్రం 6గం.లకు ముగుస్తుందని యువతకు ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి నాగేశ్వర రావు మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1950వ సంవత్సరం జనవరి 25వ తేదిన భారత ఎన్నికల సంఘం ఏర్పడిన తరువాత జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం యువ ఓటర్లను ప్రోత్సహించడానికి గాను జనవరి 1తేది నాటికి 18 సంవత్సారాలు నిండిన యువతకు ముందస్తు ఓటర్ నమోదుకు కూడా అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అలాగే యువత ఎటువంటి ప్రలోబాలకు గురికాకుండా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.అనంతరం నూతనంగా ఎంపికైన యువ ఓటర్ల మనోభావాన్ని జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్న తరువాత కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్ అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా యువ ఓటర్లు 8మందిని, సీనియర్ సిటిజెన్ లైన 6 మంది ఓటర్లను మరియు 7 మంది విభిన్న ప్రతిభావంతులను, అలాగే యువతకు ఎన్నికలపై ఎంత స్థాయి అవగాహన ఉందో తెలుసుకోవడానికి వ్రాత పోటీలలో సీనియర్ విభాగంలో 3, జూనియర్ విభాగంలో 3, ప్రసంగ పోటీలలో సీనియర్ విభాగంలో 3, జూనియర్ విభాగంలో గెలుపొందిన వారిని దుశాలువ మరియు జ్ఞాపికతో సన్మానించారు.అదే విధంగా వారి పరిధిలో ఉత్తమ సేవలను కనబరిచిన అధికారులైన జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, డిఆర్ఓ నాగేశ్వర రావు, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, కర్నూలు అర్బన్ ఎంఆర్ఓ ఐ.విజయశ్రీ, కల్లూరు ఎంఆర్ఓ టి.వి.రమేష్ బాబులను సన్మానించి అనంతరం అందరూ జిల్లా మరియు మండల స్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావును దుశాలువ మరియు జ్ఞాపికతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి, సెట్కూరు సిఈఓ పివి.రమణ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి విజయ, గూడూరు ఎంఆర్ఓ శివరాముడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళీ, ఎన్నికల సిబ్బంది, బిట్స్, జి.పుల్లయ్య ఇంజనీరింగ్ విద్యార్థులు, ఉస్మానియా మరియు కెవిఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

About Author