విద్యార్థుల భవిష్యత్తు పదో తరగతి ఉత్తీర్ణత పై ఆధారపడి ఉంది
1 min read– సాంఘీక సంక్షేమం శాఖ వసతిగృహాల పదోతరగతి
– విద్యార్ధులకు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమం..
– జిల్లా సాంఘీక సంక్షేమశాఖ .. జేడి ఎస్.మధుసూధనరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : విద్యార్ధులయొక్క భవిష్యత్తు పదోతరగతి ఉత్తీర్ణతపై ఆధారపడి ఉందని జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్. మధుసూధనరావు తెలిపారు. మంగళవారం స్ధానిక సహాయ సాంఘీక సంక్షేమశాఖ కార్యాలయంలో ప్రతిభకు ప్రేరణ అనే కార్యక్రమాన్ని డా. బి.ఆర్. అంభేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా సోషల్ వెల్పేర్ జేడి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏలూరు సహాయ సాంఘీక సంక్షేమ శాఖ వారి పరిధిలో గల కొవ్వలి, కూచిపూడి, ఏలూరు బాలురు మరియు బాలికల వసతిగృహాల్లో ఉన్న పదోతరగతి విద్యార్ధినీ విద్యార్ధులు ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతిభకు ప్రేరణ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. విద్యార్ధలయొక్క భవిష్యత్తు పదోతరగతి ఉత్తీర్ణత శాతంపై ఆధారపడి ఉందని తెలిపారు. అన్ని సబ్జెక్టులలో పరీక్షకు సంబంధించిన అవగాహన కలిగించి విద్యార్ధులయొక్క సందేహాలను నివృత్తిని చేసి పదోతరగతి పరీక్షలకు సన్నద్ధం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ సాంఘీక సంక్షేమ శాఖ అధికారులు కె. త్రిమూర్తులు, పి. సురేష్ బాబు, బి. రామారావు, ఎస్. గోల్డెన్, కె. సత్యనారాయణ, జి. రాధ, బి. రమేష్, బోధన నిష్ణాతులు ఎ. మురళీకృష్ణ , వి. విజయలక్ష్మీ, జి. దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.