మనీ పూలింగ్ పేర బురిడీ కొట్టించే వారి ఆటకట్టు !
1 min readపల్లెవెలుగువెబ్ : అధిక ఆదాయం ఆశజూపి అమాయక ప్రజలను బురిడీ కొట్టించే వారికి చెక్ పెట్టేందుకు మనీ పూలింగ్ స్కీమ్‌లుగా పిలిచే సామూహిక పెట్టుబడి పథకాల నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. ఈ పథకాలకు సంబంధించిన కొత్త నియమావళిని విడు దల చేసింది. సీఐఎస్ పథకాల నిర్వాహకులకు కనీస నెట్‌వర్త్ పరిమితిని పెంచింది. అలాగే, సీఐఎస్ ను నిర్వహించేవారికి గత ట్రాక్ రికార్డు కలిగి ఉండాలన్న నిబంధనను సైతం ప్రవేశపెట్టింది. అంతేకాదు, సీఐఎస్ లకు క్రాస్ హోల్డింగ్ నియమావళినీ ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం.. ఏదైనా సంస్థ ఒకటి కంటే ఎక్కువ కలెక్టివ్ ఇన్వెస్టమెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో 10 శాతానికి మించి వాటా కలిగి ఉండటానికి వీల్లేదు.