భానుడి ప్రతాపం .. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గత మూడు రోజుల నుంచి వేడి గాలులు వేసవి ఉష్ణోగ్రతలు ప్రజలకు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి వేడిగాలులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మండలం లో గురువారం రోజు ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ నెలలో అత్యధికం. రాబోయే 3 రోజులు ఎండల తీవ్రత కొనసాగవచ్చని అంచనా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచించారు. భానుడి దెబ్బకు మధ్యాహ్నం ప్రజలు బయటికి రావడం మానేశారు ముస్లిం సోదరుల పవిత్ర మాసమైన రంజాన్ ఉపవాసాలు ఈసారి కఠినంగా ఉన్నాయని ముస్లిం సోదరులు పేర్కొన్నారు సిమెంట్ లోడ్ కోసం జిందాల్ సిమెంట్ పరిశ్రమకు వచ్చే లారీ డ్రైవర్లు చిందుకురు తిరుపాడు గ్రామాల శివారులో ఉన్న పోలాల వద్ద ఉన్న బోర్ల వద్ద ఎండ వేడికి తట్టుకోలేక స్నానం చేస్తున్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక వేడి ఉందని డ్యూటీ చేయాలంటే చాలా కష్టం ఉందని చెప్పడం వాతావరణం మార్పుకు సంకేతం ఈసారి వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో మే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుంది ఉక్క పోత జూన్ నెల ఆఖరి వరకు ఉంటుంది.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచినీళ్లు ఎక్కువగా తాగడం మజ్జిగ టెంకాయ నీళ్లు ఓఆర్ఎస్ ద్రవపదార్థాలను తాగడం మంచిది.