NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటింటికీ సంక్షేమ పథకాల ఘనత జగనన్నదే

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: అర్హులైన ప్రతి లబ్దారుడికి ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నదే అని జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో మంగళవారం సాయంత్రం పల్లెకు పోదాం అనే కార్యక్రమం గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగినది.ఈ సందర్భంగా ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ, వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకువచ్చిందని గత టీడీపీ ప్రభుత్వం పనులు చేయకుండానే టిడిపి నాయకులు నిధులను మింగేశారని ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ప్రతి ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించిందని వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు నాకు కృషి చేయాలని అన్నారు.చెప్పిన హామీల కన్నా ఎక్కువగానే పథకాలను ప్రజల మధ్యకు తీసుకువచ్చారని వా రు అన్నారు.తదనంతరం గ్రామంలో జెండాను నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ టి.నబి రసూల్,జెసిఎస్ మండల కన్వీనర్ రవి కుమార్,ఈఓఆర్డి ఫక్రుద్దీన్, మల్లు శివ నాగిరెడ్డి, కడుమూరు శంకర రెడ్డి,విశ్వం రెడ్డి,అన్వర్ భాష,కలమందలపాడు మహబూబ్ బాష,నాయకులు రామలింగా రెడ్డి రెడ్డి,సిరిగిరి పుల్లయ్య,అబ్దుల్ ఘని,పంచాయితీ కార్యదర్శి శాలు బాష మరియు ప్రజలు పాల్గొన్నారు.

About Author