శ్రీశైలం క్షేత్రం లో కార్తీక మాస వైభవం
1 min read– కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు.
పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: రద్దీ దృష్టిలో ఉంచుకొని వేకువజామునే ఆలయ అధికారులు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం మహా క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. పరమ శివుని ప్రీతికరమైన మొదటి సోమవారం కావటంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో క్షేత్రానికి భక్తులు చేరుకున్నారు. భక్తులకు అలంకార దర్శనాలు కల్పించరు భక్తులకు ఎటువంటి ఇబ్బందులకు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో లవన్న అధికారులను ఆదేశించారు. క్యూకాంప్లెక్స్ వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు మరియు వేడిపాలు భక్తులకు అంద చేస్తున్నారు. తెల్లవారుజుమున కృష్ణా నదిలో పుణ్య నది స్నానాలు చేసి కృష్ణమ్మకు పసుపు కుంకుమ సారెలు సమర్పించి కార్తీక దీప దానాలు చేశారు. ఆలయ పరిసరాల్లోని గంగాధర మండపం మరియు ఉత్తరమాడ వీధి వద్ద భక్తులు కార్తిక దీపారాధన చేస్తున్నారు స్నానాల ఘాట్ వద్ద ప్రమాదాలు జరుగకుండా ఆలయ అధికారులు గజ ఈతగాలను ఏర్పాటు చేశారు సాక్షి గణపతి ఆలయం వద్ద ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా ఎప్పటికప్పుడు సిసి కంట్రోల్ రూమ్ లో పర్యవేక్షిస్తున్నారు ఆలయ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీశైలం క్షేత్రం శివనామస్మరణతో మారుమోగుతోంది. ఉత్తర మాడ వీధిలో భక్తుల కోసం వివిధ సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు ఆలయ పుష్కరిణి వద్ద దీపోత్సవం పుష్కరిణి దశవిధ వరదలు ఆలయ అర్చకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో లవన్న దంపతులు ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.