కర్నూలుకు శాశ్విత నీటి పరిష్కారమే లక్ష్యం..
1 min read– నగర మేయర్ బీవై రామయ్య
– గాజులదిన్నె, సుంకేసుల డ్యాంలను పరిశీలించిన మేయర్, కమిషనర్
పల్లెవెలుగు వెబ్, గోనెగండ్ల : కర్నూలు నగరానికి శాశ్వితంగా నీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యమని నగర మేయర్ బీవై రామయ్య అన్నారు. శనివారం సుంకేసుల, గాజులదిన్నె ప్రాజెక్టులను మేయర్‌తోపాటు కమిషనర్ డీకే బాలాజీ ఐఏఎస్, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక పరిశీలించారు. గాజులదిన్నె ప్రాజెక్టులలో నీటి సామర్థ్యం వివరాలను అసిస్టెంట్ డైరెక్టర్ రవి కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ కర్నూలు నగరంలో గతంలో మూడు లక్షల మంది జనాభా ఉండేవారని, ఇప్పుడు ఆరు లక్షల మందికి చేరువయ్యారని, న్యాయరాజధాని వస్తే నీటి సమస్య తీవ్రతరమయ్యే అవకాశం లేకపోలేదని, అందుకే డ్యాంలను పరిశీలించామన్నారు. డ్యాంల నీటి సామర్థ్యం పెంచడం, మరమ్మతులు ఉంటే చేయించడం, తాగునీటి సరఫరాలో సమస్యలుంటే పరిష్కరించడం తదితర అంశాలపై త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఎస్సీ పాండురంగారావు , మున్సిపల్ ఇంజనీర్ సురేంద్ర బాబు, డిఈ రవి ప్రకాష్ నాయుడు, గోనెగండ్ల ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.