PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందూ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం.. : గౌరి

1 min read

విశ్వహిందూ పరిషత్ – మాతృ మండలి రాష్ట్ర కన్వీనర్ గౌరి….

పల్లెవెలుగు వెబ్​:విశ్వ హిందూ పరిషత్ – మాతృమండలి, కర్నూలు వారి ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి ప్రఖంఢ ( 4 వ పట్టణ పోలీస్ నేషన్ పరిధి) లోని నాయీ బ్రాహ్మణులు నిర్మించిన శ్రీ సద్గురు త్యాగరాజ సీతా రామాలయ కళ్యాణమండపం,శరీన్ నగర్ లో  శుక్రవారం ఉదయం 10:00 గం.లకు జరిగిన శిక్షార్థుల “శిక్షణా  ముగింపు కార్యక్రమం” లో జ్యోతిప్రజ్వలన, శిక్షణా కేంద్రం సభ్యులు దేశభక్తి గీతాలు,కోలాటం,పల్లెపాటలు,ఉపన్యాసం వంటి కార్యక్రమాలనంతరం శ్రీ సద్గురు త్యాగరాజ సీతా రామాలయం కమిటీ అధ్యక్షులైన ఉదయప్రసాదు అధ్యక్షత లో జరిగిన సభలో విశ్వహిందూ పరిషత్ – మాతృ మండలి రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి గౌరి మాట్లాడుతూ…బడుగు,బలహీన వర్గాలవారు,దిగువ మధ్యతరగతి వారు ఎక్కువగా నివశించే శరీన్ నగర్లో ముఖ్యంగా హిందూ మహిళలు మహమ్మారి కరోనా కారణంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న పరిస్థితుల్లో, హిందూ మహిళల్లో ఆత్మవిశ్వాసం,ఆర్థిక స్వావలంబనను పెంచడం కోసం  విశ్వహిందూ పరిషత్ విజ్ఞాన పీఠం కార్యదర్శి గురుమూర్తి,భగవాన్ శ్రీ బాలసాయిబాబా సేవాట్రస్ట్ ఛైర్మెన్ రామారావు గారల ధాతృత్వంతో శ్రీ శారదా మాత ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం పేరుతో గత సం.ఆగష్టు 29 వ తేదీన కేంద్ర,రాష్ట్ర విశ్వహిందూపరిషత్ నాయకుల చేతులమీదుగా ప్రారంభించబడి మొదటి బ్యాచ్ 25 మంది యువతులకు,మాతృమూర్తులకూ  శిక్షణ ఇచ్చామనీ,అంతేకాక మన ప్రియతమ ప్రధానమంత్రి మాన్య నరేంద్రమోడీ గారు ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ పథకం లో భాగంగా విశ్వహిందూపరిషత్ – మాతృ మండలి ఈ ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నామనీ నేటితో మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి అవుతుందనీ,అలాగే శిక్షణా పొందిన స్త్రీలకు ఇక్కడే ఉపాధి కలిగించాలన్న ఆలోచనతో రెడీమేడ్ బట్టలతయారీకూడా  ప్రారంభిస్తున్నామని తెలియజేశారు.

విశ్వహిందూపరిషత్ జిల్లా అధ్యక్షులు సాధు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం మొదటి బ్యాచ్ 25 మంది శిక్షణపూర్తి అవ్వడానికి,శిక్షణా కేంద్రం నిర్వహణను పర్యవేక్షిస్తున్న విశ్వహిందూ పరిషత్ నగర మాతృశక్తి కన్వీనర్  భార్గవి,కుట్టు లో శిక్షణను ఇస్తున్న శిక్షకులు  విజయలక్ష్మి గార్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రయివేటు స్కూళ్ళకు  సంబంధించిన “యూనిఫామ్” లు కుట్టే అవకాశాన్ని సాధ్యమైనన్ని ఎక్కువ స్కూళ్ళ నుండీ మన ఈ శారదా మాత ఉచిత కుట్టుశిక్షణా కేంద్రానికి కాంట్రాక్టు ఇప్పించే అవకాశాలను తాను ప్రయత్నిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మ ప్రసార్ కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్,జిల్లాకార్యదర్శి విజయుడు,జిల్లాఉపాధ్యక్షులు వాసుదేవయ్య,జిల్లా సత్సంఘ కన్వీనర్ మాళిగి భాను ప్రకాష్, జిల్లా దుర్గా వాహిని కన్వీనర్  జంపాల రాధిక, నగర కన్వీనర్  సింధూర శ్రీవాణి, నగర మాతృశక్తి కన్వీనర్ శ్రీమతి భార్గవి,ప్రఖండకన్వీనర్ శ్రీమతి విజయలక్ష్మి,శ్రీమతి గోరంట్ల సుకన్య,నగర భజరంగ్దళ్ సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్,ప్రఖంఢ కార్యదర్శి నవీన్ కుట్టుసెంటర్ సభ్యులు పాల్గొన్నారు.

About Author