డిమాండ్ల సాధనే లక్ష్యం..24న మహాధర్నాకు తరలిరండి : FAPTO
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: డిమాండ్ల సాధనే లక్ష్యంగా… 24న చేపట్టే మహాధర్నాకు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు అప్టా జిల్లా అధ్యక్షుడు మునగాల మధుసూదన్ రెడ్డి. శనివారం కర్నూలు జిల్లా అప్టా కార్యాలయంలో కర్నూలు తాలూకా మహా ధర్నా సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ మరియు డిఏ మంజూరు విషయం లో తీవ్ర జాప్యం జరుగుతోందని, సి పి ఎస్ రద్దు కు హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదన్నారు. విద్యా రంగంలో NEP పేరుతో ప్రాథమిక తరగతులు తరలించి ఉపాధ్యాయ పోస్టు లను తగ్గించటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో కర్నూలు FAPTOజిల్లా ఇంచార్జి కె.ప్రకాష్ రావు, BTA రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఆనంద్, APTF 1938 జిల్లా నాయకులు ఇస్మాయిల్ మరియు హాబీబుల్లా, UTF నాయకులు వీరారెడ్డి, అప్టా జిల్లా ప్రధాన కార్యదర్శి సేవా నాయక్ మరియు సుధాకర్, అప్టా జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ బషీర్, యోగీశ్వర రెడ్డి ,చాంద్ బాషా మరియు కృష్ణ ఉన్నారు.