నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం
1 min readఆయుష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కోడూరు గోపాలకృష్ణ
9న ఏలూరులో ఆయుష్ హాస్పిటల్స్ ప్రారంభం
పల్లెవెలుగు,ఏలూరు: దశాబ్ద కాలంగా విజయవాడలో అత్యుత్తమ ప్రమాణాలతో ఆధునిక సదుపాయాలతో, 24 గంటలు ప్రముఖ వైద్యులతో సేవలు అందిస్తున్న ఆయుష్ హాస్పిటల్ వారి సేవలు ఇప్పుడు గోదావరి జిల్లాల ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయుష్ హాస్పిటల్ వారు ఏలూరు అశోకనగర్ నందుది. 09.01.2022 తేదీన ఉదయం 9.30 గంటలకు ఈ హాస్పిటల్ని ప్రారంభిస్తున్నారు. దీనిలో అన్ని రకాల ఆధునిక వైద్యం,ఇమేజింగ్ సర్వీసెస్ మరియు లేబరేటరీ సేవలు కల్పించబడుతున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) పాల్గొననున్నారు. మరియు విశిష్ట అతిథులుగా జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని), ఏలూరు పార్లమెంటు సభ్యులు శ్రీధర్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వెస్ట్ గోదావరి డి ఐ జి కె వి మోహన్ రావు ఐపీఎస్ మరియు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ పెద్ద బాబు ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కోడూరు గోపాలకృష్ణ మాట్లాడుతూ అంకితభావం,విలువలతో కూడిన నాణ్యమైన వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా ఈ హాస్పిటల్ ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట లభ్యమయ్యేలా, వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఏలూరు లోనే చికిత్స జరిగేలా తమ హాస్పిటల్ ని తీర్చి దిద్దుతున్నట్లు ఆయుష్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ముక్కామల అప్పారావు తెలిపారు.హాస్పిటల్ డైరెక్టర్ మరియు చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ కంఠమనేని శ్రీనివాస సాయి మాట్లాడుతూ 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ హాస్పిటల్ ని భూకంపాలు తట్టుకునే విధంగా నిర్మించడం తో పాటుగా ఈ భవనం దృఢంగా ఉండేందుకు అత్యాధునికమైన షేర్ వాల్ టెక్నాలజీని వాడటం జరిగిందని తెలిపారు. సమాజంలో అవసరమైన ప్రతి ఒక్కరికి ఆధునిక వైద్య సేవలు సకాలంలో సత్వరంగా అందించడం తమ ఉద్దేశం అని హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ యార్లగడ్డ రమేష్ బాబు తెలిపారు. ఆయుష్ హాస్పిటల్ లో సుశిక్షితులైన, నిపుణులైన వైద్యులను, నర్సింగ్ మరియు సహాయక సిబ్బందిని 24/7 అందుబాటులో ఉంచుతున్నట్లు, అత్యవసర పరిస్థితులలో సత్వరంగా చికిత్సలు అందేటట్లు ఏర్పాట్లు చేస్తామని కార్డియాలజీ హెచ్ ఓడి డాక్టర్ పి శ్రీనివాస చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు,రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు నగర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.