ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
1 min read– శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీ అధినేత సాయి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్ అండ్ ఎడ్యుకేషన్ అకాడమీ లక్ష్యమని ఆ సంస్థ అధినేత సాయినాథ్ అన్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని శ్రీ సాయి గ్లోబల్ కంప్యూటర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ నందు ట్రైనింగ్ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు జె. లక్ష్మీ నరసింహ యాదవ్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ రాగుల రాముడు, వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం అత్యవసరమని, ఇక్కడ విద్య నేర్చుకున్న ప్రతిఒక్కరూ ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో ట్రైనింగ్ ఇస్తున్నటువంటి డైరెక్టర్ సాయినాథ్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం 20 మంది విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు.