PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యల పరిష్కారమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం..

1 min read

అర్హత ఉంటే ఇళ్ల ముంగిటకే సంక్షేమ పథకాలు..

వడ్డేమాను లో  పండుగ వాతావరణంలో జరిగిన గడప గడప కు మన ప్రభుత్వం.

గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్ఏ ఆర్థర్.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అర్హులందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలును అందించడమే తన లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్  పేర్కొన్నారు. నందికొట్కూరు మండలం వడ్డేమాను గ్రామంలో శుక్రవారం  గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే  ఆర్థర్ పాల్గొన్నారు .  ప్రతి గడపకు వెళ్లి  ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, ప్రజా సనస్యలుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ జగన్ పాలనలో పార్టీలు, కులాలు, మతాలకతీతంగా అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. నాలుగేళ్ళ పాలనలో ప్రతి ఇంటికీ వేలాది, లక్షలాది రూపాయలు లబ్దిపొందడం జరిగిందన్నారు.గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థలను ఏర్పాటు చేసి పాలనను ప్రజల చెంతకు చేర్చడం జరిగిందన్నారు. అర్హత ఉండి ఇళ్ళు రానివారికి ఇళ్ళను మంజూరు చేయిస్తామన్నారు.గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపంగా జగనన్న ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు నిలుస్తున్నాయని  అన్నారు.  సీఎం జగన్  గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి  దేశంలో ఎక్కడా లేని విధంగా   పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలోనే ప్రజలకు సేవలందిస్తున్నారు.  ప్రజా అవసరాల నిమిత్తం మండల, జిల్లా  కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా  వ్యయ, ప్రయాసలు లేకుండా చేశారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలను అందచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్  గంగిరెడ్డి రమాదేవి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ హాజీ అబ్దుల్ శుకూర్ , వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి  వనజ , వడ్డేమాను వార్డు మెంబర్ సగినెల.దాసు, నందికొట్కూరు మండల వైసీపీ నాయకులు  ఉండవల్లి ధర్మారెడ్డి ,  బ్రాహ్మణకొట్కూరు యువ నాయకులు  ఉదయ్ కిరణ్ రెడ్డి ,మాజీ సింగిల్ విండో చైర్మన్  మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి , రాఘవేంద్ర రెడ్డి , వైసీపీ జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు పైపాలెం  ఇనాయతుల్లా , పాములపాడు మండల నాయకులు శ్రీముడియాల వెంకట రమణారెడ్డి, దామగట్ల రత్నం, సంజన్న ,వేల్పుల నాగన్న, శాటనకోట వెంకటేశ్వర్లు, కోనేటమ్మపల్లి బోరెల్లి. రఘు, బొరెల్లి తిరుపాలు,  నాగటూరు ఉప సర్పంచ్ శ్రీ సగినేల హుస్సేనయ్య గారు, నాగుటూరు సుజిత్ కుమార్ రెడ్డి, బిజినవేముల మహేష్, మండల తహశీల్దార్  రాజ శేఖర్ బాబు, మండల అభివృద్ధి అధికారి  శోభారాణి ,  ప్రభుత్వ శాఖల అధికారులు, వైసిపి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author