లక్ష్యం గొప్పదిగా ఉండాలి : ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: విద్యార్థులు తమ ఇష్టమైన రంగాన్ని ముందుగానే ఎంచుకొని ఆ దిశలో మూడేళ్ళు దీక్షతో కృషిచేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ అన్నారు. కర్నూలు నగరంలోని కె.వి.ఆర్ కళాశాలలో మూడవరోజు దీక్షారంబ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ ప్రథమ సంవత్సరపు విద్యార్థులతో ఎస్పీ మాట్లాడారు. లక్ష్యం గొప్పదిగా ఉండాలన్నారు . మంచి లక్ష్యం వైపు స్థిరంగా నడుస్తున్నప్పుడు దారులు అనేకం కనిపిస్తాయన్నారు . ఫలితం వైపు చేరుకుంటామన్నారు. మహిళా విద్యార్థులు తాము ఏమైనా సాధించగలరని , తమను తాము ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకోరాదన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అనేక రంగాల్లో, వృత్తులలో, ఉద్యోగాలలో రాణిస్తున్నారని విపులంగా విద్యార్థులకు తెలిపారు. కాలక్షేపంతో గడిపతే విద్యార్థులు నష్టపోతారని, విద్యార్ది కష్టపడి చదవటమనేది ఇష్టంగా చేసినప్పుడే జీవితం ఆనందంగా ఉంటుందన్నారు. కళాశాల ప్రధానాచార్యులు ఇందిరి శాంతి మాట్లాడారు. విద్యార్థికి చిత్తశుద్ధి ముఖ్యమని , మనసు మాట ,క్రియ అన్నీ లక్ష్యమే కావాలని విద్యార్థులకు హితవు తెలిపారు.
ఈ కార్య క్రమంలో వీరాచారి వైస్ ప్రిన్సిపాల్ పరీక్షల విభాగం గురించి తెలిపారు. సూపర్ న్యూమర్ ప్రిన్సిపల్ రాజేంద్రమమార్ క్రమశిక్షణ , వినయం , శ్రద్ధ గొప్పవని తెపారు. మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా మాథ్స్ విభాగం, బి.ఏ విభాగం విద్యార్థులకు తగిన విద్యా , ఉపాధి రంగాల్లో , భోధనాంశాల్లో సంబంధిత అధ్యాపకులు విద్యార్ధులకు అవగాహన కల్పించారు. విద్యార్ధులు అనేక అంశాలపై సందేహాలను, సలహాలను జిల్లా ఎస్పీ అడిగి నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో డా. ఫరీదా, డా. ఇంద్రావతి, డా పరిమళ, శ్రీమతి శోభ, డా. రజని , డా. గిరిజా రాణి, డా.ఇర్ఫానా, డా. తలక్ పర్వేన్, డా . జయలక్ష్మి ,విజయలక్ష్మీ, రాద్రావమణి, ఎన్సీసి సునీత మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు . NCC . సునీత కెవిఆర్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.