పరిపాలనా విప్లవానికి నాంది వాలంటీర్ వ్యవస్థ..
1 min readఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుంది.
మండల వాలంటీర్లుకు పురస్కార ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ పరిపానలో ఒక గొప్ప విప్లవానికి నాందిగా నిలిచిందని నందికొట్కూరు ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి అన్నారు.సోమవారం జరిగిన మండలంలోని వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లుకు పురస్కార ప్రదానం కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎంపీపీ పాల్గొన్నారు.ఎంపీడీఓ నరేష్ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా నిలబడి సేవాభావం తో లంచాలు లేకుండా, వివక్షతకు తావులేకుండా సేవలందిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను ప్రోత్సహిస్తూ వరుసగా నాల్గవ ఏడాది వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నారన్నారు. మహాత్మా గాంధీకలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధన దిశగా సీఎం జగన్ సచివాలయ వ్యవస్థను నెలకొల్పి, ప్రజలకు సేవ చేసే సదవకాశాన్ని ఎంతోమంది యువతకు కల్పించారన్నారు. ఈ సచివాలయ వ్యవస్థలో కీలక పాత్ర ఎవరిది అని అంటే ప్రజల దగ్గర నుండి పాలకుల వరకు, అధికారుల నుండి అధిష్టానం దాకా చెప్పే ఒకే మాట గ్రామ వాలంటీర్లు అని, మన గ్రామ వాలంటీర్లు ప్రజలకు – అధికారులకు మధ్య వారధులుగా ఉండి ప్రభుత్వ పథకాలను ప్రజల గడపకు నేరుగా చేరవేస్తూ, అదే విధంగా ప్రజల సమస్యలను అధికార యంత్రాంగానికి చేరవేస్తున్నారన్నారు. గతంలో పెన్షన్ కష్టాలు అందరికి తెలుసు, కాని ఇప్పుడు సూర్యుడు రాక ముందే మన గ్రామ వాలంటీర్లు అవ్వ తాతలకు. పెన్షన్లను ఇంటి వద్దకే అందిస్తున్నారు. గతంలో కరోనా సమయం లో గ్రామ వాలంటీర్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, కిరాణా సరుకులు, మందులు, కరోనా సమయంలో చేసిన సేవలు ఎన్నటికి మరువలేనివని గుర్తు చేస్తూ అవార్డులు పొందిన వాలంటీర్లకు అభినందనలు, వందనాలు తెలియచేస్తూ మండలంలోని వాలంటీర్లు అందరినీ పేరు పేరునా పలకరిస్తూ పురస్కారాలు అందచేశారు.కార్యక్రమంలో జడ్పీటిసి కలిమున్నీసా, మండల వైసీపీ పార్టీ కన్వీనర్ బిజీనవేముల సర్పంచి రవియాదవ్ ,వైసీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి రవికుమార్, శాతనకోట సర్పంచి జనార్ధన్ గౌడు, కొణిదెల సర్పంచి కొంగర నవీన్, వైసీపీ జేఏసీ నాయకులు ఓంకార్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.