ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుంది
1 min read– ఉపాధి హామీ రక్షణ కోసం ఉద్యమం వ్యవసాయకార్మిక సంఘం
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అసరా గా ఉన్న, పోరాడి సాధించుకున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని దీనికీ వ్యతిరేకంగా కూలీలు ఐక్యంగా ఉద్యమిద్దామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కరివేముల గ్రామంలో ఉపాధి హామీ పనులు ఆయన పరిశీలించి కూలీలతో మాట్లాడారు… ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు, రెండు పూటలా హాజరు, వారాల తరబడి పెండింగ్ బిల్లుల వలన తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ చట్టం పరిరక్షణకై రోజురోజుకీ కేంద్ర బడ్జెట్ లో నిధులు కుదింపును నిరసిస్తూ అదేవిధంగా కూలీలకు గతంలో ఇస్తున్నటువంటి అలవేన్సులు, వేసవి అలవెన్స్, రవాణా, గడ్డపార అలవెన్సులు, మంచినీటి అలవెన్సులు, పని ప్రదేశం దగ్గర మౌలిక సదుపాయాలు ఉండేవని, కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని ఎత్తివేసి కూలీల కడుపు కొడుతూ, ఉపాధి హామీ పనిని ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు రాముడు, మెటీలు, కూలీలు లక్ష్మన్న నరసప్ప ఈరన్న కుమార్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.