PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చాలా బాధ్యతతో  ప్రభుత్వం పరిపాలన చేస్తోంది

1 min read

– సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రగతి పట్టాలు

– రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: చాలా బాధ్యతతో  ప్రభుత్వం పరిపాలన చేస్తోందని ప్రజలకు తెలియ చేస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు.బుధవారం ఆదోని  మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో ఆదోని, ఆలూరు నియోజకవర్గ స్థాయి సమావేశం అనంతరం  రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక నియోజకవర్గంలో కూడ స్థానిక సమస్యలు, అవసరాలు ఏమి  ఉన్నాయి,  వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు అన్న ఉద్దేశ్యంతో   జిల్లా ఇంఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో  స్థానిక ఎమ్మెల్యే తో పాటు జిల్లా కలెక్టర్,  అధికారులతో సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు… ఆలూరు, ఆదోని రెండు నియోజకవర్గాల్లో  పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు,అవసరాల గురించి సమీక్షించడం జరిగిందన్నారు..శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా సమీక్షించడం జరుగుతుందని,  ఎందుకంటే నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యల పై సంబంధిత ప్రజా ప్రతినిధులకు ఎక్కువ అవగాహన ఉంటుందని, అందుకే  ఈ సమావేశాన్ని సంబంధిత నియోజకవర్గంలోనే ఏర్పాటు చేశామన్నారు. సంక్షేమంలో గాని, అభివృద్ధి లో  ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు రానివ్వకుండా పరిపాలన చేయాలన్నదే రాష్ట్ర  ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.సంక్షేమానికి సంబంధించి  సాచురేషన్  పద్ధతిలో అర్హత కలిగిన  ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి చేకూరేలా చూస్తున్నామని, ఈ అంశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి  పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.ఆలూరు కి సంబంధించి కొన్ని నీటి పథకాలు, రోడ్డు సమస్యలు, ఆలూరు హెడ్ క్వార్టర్స్ కి సంబంధించిన తహశీల్దార్ కార్యాలయం, ఆర్ అండ్ బి వసతి గృహం, వైల్డ్ లైఫ్ కి సంబంధించి జింకల పార్కు, ఇరిగేషన్ కి సంబంధించి డిస్ట్రిబ్యూటరిస్ వంటి ముఖ్యమైన సమస్యలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రస్తావించారన్నారు..అలాగే  ఆలూరు సంతమార్కెట్ అభివృద్ధి,ఆస్పరి మండలం బనవనూరు నుండి పొట్లపాడు వంతెన, ధనాపురం నుండి హొలగుండ రోడ్డు, హొలగుండ బస్టాండ్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు  రోడ్డు పరిస్థితి మెరుగుపరచాలని, ఆదోని – సిరుగుప్ప రోడ్డు నుండి గజ్జెహళ్లి వరకు  రోడ్డు,ఆలూరు టౌన్ నందు గల బళ్ళారి – కర్నూల్ రోడ్డు, హాలహార్వి, దేవనకొండ, ఆలూరు కి సంబంధించిన పి హెచ్ సి కేంద్రాలలో  మరమ్మతులు, హాలహర్వి నందు లైబ్రరీ భవనం, జునియర్ కాలేజ్ , బాపురం నందు కొత్త అంగన్ వాడి సెంటర్, దేవనకొండ మండలం నందు మోడల్ స్కూల్  అవసరం గురించి కూడా ప్రస్తావించారని, వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు.ఆదోని కి సంబంధించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరమ్మతులు చేయించాలని, ఆదోని రూరల్ మండలం కి సంబంధించిన నీటి సరఫరా, ముఖ్యమైన రోడ్లు, ప్రభుత్వ డిగ్రీ కాలేజి అధ్యాపకుల నియామకం, ఐటీఐ కాలేజీ స్టాఫ్, మైనార్టీ ఐటీఐ సంస్థ, మహిళా జూనియర్ కాలేజ్, ఆటోనగర్, తదితర సమస్యలను చర్చించడం జరిగిందని వాటిని ఫాలో అప్ చేసి  పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.ఉమ్మడి జిల్లాల అభివృధి తీసుకున్నట్లయితే, సంగమేశ్వరం నుండి నంద్యాల వరకు నేషనల్ హైవే, నంద్యాల నుండి జమ్మలమడుగు కి నేషనల్ హైవే, డోన్ నేషనల్  హైవే, ఆలూరు బైపాస్ నేషనల్ హైవే, కర్నూలు నుండి గార్గేయపురం వరకు 100 కోట్ల రూపాయలతో ఫోర్ లైనింగ్ లాంటి రోడ్ల అభివృద్ధి పనులు చేశామన్నారు .గాజ్జులదిన్నె ప్రాజెక్ట్ నుండి assured  వాటర్ ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేదు  కానీ మన రాష్ట్ర ప్రభుత్వం 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హెచ్ ఎన్ ఎస్ ఎస్ నుండి కనెక్షన్ ఇచ్చి  4 టి ఎమ్ సి ల సామర్థ్యం ఉన్న గాజ్జులదిన్నె ప్రాజెక్ట్ ను 5.5 టి ఎమ్ సి లు గా పెంచడం జరిగిందని, ఈ ప్రాజెక్టును ఈ సంవత్సరం ప్రారంభించే విధంగా  చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నేషనల్ హైవేలు గతంలో లేనన్ని సాధించుకున్నామని, అత్యంత వెనుకబడిన పత్తికొండ ప్రాంతంలో 68 చెరువుల ప్రాజెక్టును పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి చేతుల మీదుగా త్వరలో జాతికి అంకితం చేయనున్నామని మంత్రి తెలిపారు.విద్యకు సంబంధించి కర్నూలు,ఆదోని,నంద్యాల మెడికల్ కాలేజీలు, కర్నూలు లో నేషనల్ లా యూనివర్సిటీ, సిల్వర్ జూబ్లి కళాశాల ఏర్పాటు చేయుటకు ఎంతో ఖర్చు పెట్టామన్నారు . సుంకేసుల నుంచి నీటి సరఫరా పెంచేందుకు రూ.120 కోట్లు మంజూరు చేశామన్నారు..వెనకబడిన ప్రాంతమైన ఆదోనిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటవుతుందని ఏనాడైనా అనుకున్నామా అని మంత్రి ప్రశ్నించారు ఆదోని ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ద్వారా వెనుకబడిన కర్నూలు జిల్లా నియోజకవర్గాలపై మరింత దృష్టి పెట్టామని,ఆదోని కి 250 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.రోడ్ల విస్తరణ ఎక్కడ జరిగినా ప్రధాన ఇబ్బంది భూ సమీకరణే అని, అయితే ఇందుకు కొంత సమయం పట్టొచ్చు..కానీ, సంకల్పం ఆగదని మంత్రి స్పష్టం చేశారు. పత్తికొండలో రూ.30 కోట్లతో రోడ్డు విస్తరణ మొదలుపెట్టిన మూడేళ్లకు పట్టాలెక్కడమే అందుకు నిదర్శనం అన్నారు .వైద్య పరికరాలకు ఎక్కడా  కొరత లేదని, ..ప్రభుత్వం బతికించుకున్న ప్రాణాలెన్నో గమనించాలని మంత్రి అన్నారు .ఆరోగ్యశ్రీకి గత ప్రభుత్వంలో 300 జబ్బులకు రూ.1200 కోట్లు ఖర్చుపెడితే..ఈ ప్రభుత్వం 1200 జబ్బులకు రూ.3,500 కోట్లు ప్రతి ఏటా ఖర్చు పెడుతుందన్నటు .గతంలో టైర్లు, ట్యూబ్ లు , డ్రైవర్లు లేని అంబులెన్స్ లు ఇప్పుడు కొత్త వాహనాలతో సేవలందిస్తున్నాయన్నారు.వేదావతి ప్రాజెక్టును మొదలుపెట్టామని, హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులకు మేలు జరిగింది వైఎస్ హయాంలోనే అని తెలిపారు .గత కాలంలో ప్రధాన నీటి ప్రాజెక్టులైన హెచ్ఎన్ఎస్ఎస్ సర్వేకు కు రూ.12 కోట్లు, జీఎన్ఎస్ఎస్ కు రూ.17 కోట్లు, వెలిగొండకు రూ.18 కోట్లు ఇచ్చారు..అవే ప్రాజెక్టులకు రూ.3వేల కోట్ల పైన ఖర్చు వైఎస్సార్ పెట్టారన్నారు .జల్ జీవన్ మిషన్ కింద కర్నూలు జిల్లాకు రూ.400 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.170 కోట్లు ఖర్చు పెడుతున్నామని, కర్నూలుకు న్యాయ రాజధాని అన్నది శ్రీభాగ్ ఒడంబడికలోని అంశం అని మంత్రి పేర్కొన్నారు .గతంలో  రాబడి 6 శాతం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో 16 శాతం సంపద సృష్టించడం జరిగిందని అన్నారు.కోవిడ్ -19 సమయంలో పేదవారిని కాపాడుకోవడమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేశామని  మంత్రి బుగ్గన విలేకరులకు వివరించారు.

About Author