PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవ్వ తాతలకు బాసటగా ప్రభుత్వం 

1 min read

– అవ్వ తాతలు అక్కా చెల్లెలు ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలి

– ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అవ్వ తాతలకు, అక్కా చెల్లెమ్మలకు అన్నా తమ్ముళ్లకు ఏదైతే మాట ఇచ్చారో మాటకు కట్టుబడి నేడు వారికి 3000 రూపాయలు పెంచుతూ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయఆవరణంలో ఏర్పాటుచేసిన వైయస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు, విశ్వనీయతకు, మానవత్వానికి ప్రతిరూపంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అవ్వ తాతల ముఖాలలో చిరునవ్వు చూడాలనే సంకల్పంతో వారికి ఇచ్చిన మాట ప్రకారం పెంచిన 3000 రూపాయల పెన్షన్లను అవ్వ తాతలకు అక్కా చెల్లెమ్మలకు, అన్నా తమ్ముళ్లకు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, భర్త చనిపోయిన అక్కా చెల్లెమ్మలు, ఒంటరి మహిళలు, బిడ్డలు చూడని అవ్వ తాతలు, మానసిక వికలాంగులైన అన్నా తమ్ముళ్లు, వీరందరూ కూడా ఒకరిపై ఆధారపడకుండా ఆత్మస్థైర్యంతో వారు జీవించే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అవ్వ తాతలకు అక్కా చెల్లెమ్మలకు అన్నా తమ్ముళ్లకు బాసటగా నిలుస్తూ ప్రేమతో వారందరికీ కూడా 3000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలుచేరాలని, వారు ఎవరి వద్దకు వెళ్లకుండా , ఎవరికి లంచాలు ఇవ్వకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి వారి బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు, ఇందులో కులాలు కానీ, మతాలు పార్టీలు గాని చూడడం లేదని ఆయన తెలిపారు, కానీ గత ప్రభుత్వం లో జన్మభూమి కమిటీలు వారికి అనుకూలమైన వారికే సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందని, నేడు అలాంటి దుస్థితి లేదని తెలిపారు, భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని సంక్షేమ పథకాలు నేడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని తెలిపారు, గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే, నేడు రాష్ట్రవ్యాప్తంగా 66 లక్షల 34 వేల మంది అవ్వ తాతలకు అక్కా చెల్లెమ్మలకు అన్నదమ్ములకు నెల నెల1,968 కోట్లు గత ప్రభుత్వం కంటే ఐదు రెట్లు అధికంగా ఇవ్వడం జరుగుతుందన్నారు, ప్రజలను మోసగించడం, ప్రజలకు మాయ మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని, వారి మాటలు ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదన్నారు, అధికారంలోకి వస్తే కేజీ బంగారు ఇస్తాం అంటూ మహిళల్ని మోసం చేసి ఎత్తుగడ టిడిపి అవలంబిస్తున్నదని అలాంటి మాయమాటలకు మోసపోవద్దని ఆయన ఈ సందర్భంగా కోరారు, మరోసారి మీరందరూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తే 40 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా తనే ఉంటాడని, రాష్ట్రాన్ని మరింత అబ్బు అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటారని ఆయన తెలిపారు, ముఖ్యమంత్రిని అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు అన్న తమ్ముళ్లు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీచీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి నాయకులు ఉత్తమా రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ డైరెక్టర్ చల్లా వెంకటసుబ్బారెడ్డి, సర్పంచులు తుంగ చంద్రశేఖర్ యాదవ్, సుదర్శన్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఎంపీటీసీలు, రఘురాం రెడ్డి, నిరంజన్ రెడ్డి, నాగిరెడ్డి, శ్రీనివాసరాజు, పి సి కేశవరెడ్డి, హస్రత్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, డిటి వెంకటరమణ, ఈ ఓ పి ఆర్ డి సురేష్ బాబు, ఏపీఎం గంగాధర్, కార్యదర్శులు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పెన్షన్ దారులు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

About Author