పేదల ఇళ్ల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పెరిగిన ధరలకనుగుణంగా జగనన్న ఇళ్లకు 5 లక్షలు యూనిట్ కాస్ట్ పెంచాలని,అలాగే ఇసుక,సిమెంటు, స్టీల్ ఉచితంగా ఇవ్వాలని,లేఅవుట్ కాలనీలలో మౌళిక వసతులనుకల్పించాలని సీపిఐ పోరుబాట కార్యక్రమంలో భాగంగాసిపిఐ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పి .రామచంద్రయ్య పేదల సొంతింటి నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని,దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు .పి. రామచంద్రయ్య మండల కార్యదర్శి డి .రాజా సాహెబ్ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు.రాష్ట్రవ్యాప్త సిపిఐ పోరుబాటలో భాగంగా పత్తికొండ పట్టణంలోని ఆదోని రోడ్డుకు ఉన్న జగనన్న లేఅవుట్ కాలనీలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వద్ద నుండి సంతకాల సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి నిర్మాణ సామగ్రితధరలు అమాంతంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ధరల కనుగుణంగా జగనన్న ఇళ్లకు కనీసం 5 లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు. జగనన్న కాలనీలలో అసౌకర్యాల నడుమ ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. త్రాగడానికి నీళ్లు అటుoచితే ఇంటి నిర్మాణానికి సైతం నీళ్లను కొనుక్కునే దుస్థితి నేటికి ఉండటం దారణమన్నారు.మంచినీటి ట్యాంకులు ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాయని విమర్శించారు. జగనన్న కాలనీలలో నీటి సమస్యను తీర్చాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇచ్చి ఆదుకోవాలని నాలుగు నెలల కిందట లబ్ధిదారులతో సిపిఐ ధర్నా చేపట్టిన ఏమాత్రం స్పందించలేదని ఓ పక్క అధికారులు తక్షణమే ఇంటి నిర్మాణం చేపట్టకపోతే నీకు నీకు వచ్చిన ఇల్లు రద్దు చేస్తామని అంటూ వాలంటరీ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇల్లు రద్దు చేస్తారని భయంతో లబ్ధిదారులు మూడు నుంచి పది రూపాయలు వడ్డీకి తెచ్చి అప్పలపాలై ఆత్మహత్య చేసుకున్న ప్రమాదం దాపిరించని వారు ఆవేదన చెందారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపంలో ఇల్లు నిర్మాణాన్ని తానే కట్టించి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు కేవలం లక్ష 80000 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఎట్లా కట్టుకుంటారని జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం జనవరి 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు జగనన్న లబ్ధిదారులను తో సంతకాల సేకరించి జనవరి 30వ తేదీన మండలం నియోజకవర్గ కేంద్రాల్లో సదస్సులు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఫిబ్రవరి 6వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేపడతామని ప్రభుత్వం జగనన్న ఇంటికి తక్షణమే ఐదు లక్షల పెంచాలని పేదల కలను నిజం చేయాలని డిమాండ్ చేశారు నీళ్లు నింపకపోవడం దారుణమన్నారు. , అంతిమంగా లబ్ధిదారులు ఒక్కో ట్రాక్టర్ ట్యాంకరుకు నీళ్లు కొనుక్కునే దుస్థితికి తీసుకురావడం సిగ్గుచేటన్నారు. రహదారి గుంతల మయంగా, అధ్వానంగా ఉందని తక్షణం తారు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇసుక ఉచిత మంటూనే బిల్డింగ్ చివరి బిల్లులో దాదాపు నాలుగు వేల వరకు ఇసుక కోసం కట్ చేస్తుండటం దారుణమన్నారు. బయటి మార్కెట్ లో కిలో స్టీల్ 64 రూపాయలు ఉండగా కేజీ 74 రూపాయలు చొప్పున బిల్లులో కట్ చేస్తుండటం దారుణమన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన దాదాపు 18 రకాల మౌలిక వసతులను వెంటనే చేపట్టాలన్నారు.సొంతింటి నిర్మాణ లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట ప్రారంభించిందన్నారు. ఫిబ్రవరి 6న కలెక్టరేట్ ముట్టడి, ఫిబ్రవరి 22న చలో విజయవాడ కార్యక్రమాల్లో లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కారన్న కృష్ణయ్య సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు రైతు సంఘం తాలూకా కార్యదర్శి పెద్ద ఈరన్న ఏఐటియుసి తాలూకా అధ్యక్షులు నెట్టికంటయ్య సిపిఐ ప్రజాసంఘాల నాయకులు ఎంకే సుంకన్న రామాంజనేయులు రవి తదితరులు పాల్గొన్నారు.