PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు ప్రభుత్వం నెరవేర్చాలి..

1 min read

– కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష ..

– జిల్లా అధ్యక్షులు లాంసాగర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  ఏలూరు కలెక్టరేట్ వద్ద (ఏపీ జిఇఏ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు లాంసాగర్ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, జనరల్ సెక్రెటరీ జి ఆస్కార్ రావు పిలుపుమేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను ప్రస్తుతం గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యోగులకు న్యాయ పోరాటానికి సహకరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కొన్ని ప్రధాన డిమాండ్లతో సి.పీ.ఎస్.ను రద్దుపరిచి ఓ. పి.ఎస్. ను పునరుద్ధరించాలని, ప్రతి నెల ఒకటవ తేదీన జీతభత్యాలు చెల్లించేలా చట్టం తేవాలని, అన్ని శాఖల్లో డీఎస్సీ ద్వారా నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వాలని. సమాన పనికి సమాన  వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ములను( జిపిఎఫ్ ఏపీ జి ఎల్ ఐ )భద్రత కల్పించాలని, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు  రిటైర్మెంట్ రోజునే అన్ని ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశపరిచి సమస్యలు చర్చించి పరిష్కరించాలని తెలియజేశారు. ప్రధాన కార్యచరణను మే 22 నుండి అక్టోబర్ 31 వరకు జిల్లా కేంద్రాలలో కలెక్టర్లకు వినతి పత్రాలు, అదేవిధంగా డివిజన్ పరిధిలో ఆర్డీవో లకు వినతి పత్రాలు. తాలూకా మరియు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం సమర్పించుట. (రాజ్యాంగబద్ధంగా లేని సిపిఎస్ ను రద్దు చేయాలని) అన్ని తాలూకా జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహాలకు వినతి పత్రలు. అన్ని జిల్లా కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో  కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్  రాష్ట్ర అధ్యక్షులు బుట్ట విజయ వర్ధన్ మరియు చంద్రశేఖర్, సింగరాజు, ఐ. ఎన్ టి. యు.సి నాయకులు  గోవింద్ మరియు ఉద్యోగ సంఘాల నాయకులు. ఉద్యోగులు. మహిళా ఉద్యోగులు హోరెత్తించే నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున  ధర్నాలో పాల్గొన్నారు.

About Author